రేపు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ
RR: నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో రేపు ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్స్ తీసుకురావాలన్నారు.