సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: పూసపాటిరేగ మండలం నడిపల్లిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును గురువారం ఎమ్మెల్యే లోకం మాధవి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.