'ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జగ్రత్తలు తీసుకోవాలి'

NTR: జగయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులతో కలిసి పట్టణంలోని ఊర చెరువు అలుగు వద్ద పర్యటించారు. ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేయాలని స్పష్టం చేశారు.