లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా CITU నిరసన
కడప: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 లేబర్ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉత్తర్వులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు, భద్రత, వేతనాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.