మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు

మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు

E.G: నిడదవోలు పురపాలక సంఘం ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ (డైమండ్ జూబ్లీ) వేడుకలకు బుధవారం మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి ఆయన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.