రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు: కాకాణి
AP: కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ మండిపడ్డారు. దిత్వా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి అవినీతి సంపాదన మీద ఉన్న ధ్యాస.. ప్రజల రక్షణపై లేదని ధ్వజమెత్తారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు.