VIDEO: నెల్లూరు నగరంలో భారీ వర్షం
NLR: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు నగరంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయం కావడంతో పాటు కాలువలు పొంగి ప్రవహించాయి. మాగుంట లేఔట్, ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జిల వద్ద మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఈ భారీ వర్షం కారణంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.