'మూడు రాజధానుల మాటతో గందరగోళం సృష్టించారు'

'మూడు రాజధానుల మాటతో గందరగోళం సృష్టించారు'

NTR: తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని గుర్తుచేశారు. 2019 ముందు జగన్ కూడా అమరావతికి మద్దతు ఇచ్చారని, తర్వాత మూడు రాజధానుల మాటతో గందరగోళం సృష్టించారని విమర్శించారు. 2024లో ప్రజలు అమరావతికే మద్దతుగా తీర్పు ఇచ్చారని తెలిపారు. రాజధాని అంశంపై రాజకీయాలు ఆపాలని కోరారు.