వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం

వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, వీరభద్రపురం వాస్తవ్యులు సత్యవరపు వెంకట బంగార్రాజు, కనకమహాలక్ష్మి కుటుంబ సభ్యులు రూ. 50,116 విరాళం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.