ఖాట్మండులో కర్ఫ్యూ ఎత్తివేత

జెజ్ జీ ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని ఖాట్మండ్ సహా ఇతర ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను సైన్యం ఎత్తి వేసింది. దీంతో దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరిచారు. వీధుల్లోనూ ట్రాఫిక్ రద్దీ ప్రారంభమైంది. నిరసనల టైంలో ధ్వంసమైన ప్రభుత్వ భవనాలు సహా అనేక ప్రదేశాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నారు.