యాదాద్రి క్షేత్రంలో రేపు చండీ హోమం
BHNG: యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.