రోడ్లపై ఆవుల సంచారం.. వాహనదారుల ఇబ్బందులు

రోడ్లపై ఆవుల సంచారం.. వాహనదారుల ఇబ్బందులు

GNTR: గుంటూరు సంగడిగుంట ప్రధాన రహదారిపై మంగళవారం ఆవుల మందలు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బడికి వెళ్లడానికి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ప్రజలు తెలిపారు.