'నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం'
SDPT: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ అన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఆవశ్యకత పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్సై చంద్రమోహన్, సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.