హరినామ సప్తహ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం
ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామస్తులు శ్రీ సంత్ ఏకనాథ్ నాందేవ్ మహారాజ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఈనెల 17 నుంచి నిర్వహించనున్న అఖండ హరినామ సప్తహ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందజేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 24వ తేదీ వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు.