టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్
హన్మకొండ మండలం మునిపల్లి గ్రామంలోని పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం ప్రత్యేక దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10,010 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు కోసం కేయూ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.