డెంగ్యూతో చిన్నారి మృతి

డెంగ్యూతో చిన్నారి మృతి

JN: డెంగ్యూతో చిన్నారి మృతి చెందిన ఘటన స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన శంకర-సంధ్య దంపతులకు కూతురు సాత్విక (20 నెలలు) ఉంది. టైఫాయిడ్ జ్వరానికి వారం రోజులుగా మందులు వాడుతున్నారు. తర్వాత డెంగ్యూ నిర్ధారణ కాగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది.