ఆడుదాం ఆంధ్రాను పండుగలా నిర్వహించాలి: కలెక్టర్

శ్రీకాకుళం: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అన్ని చోట్లా పండుగ వాతావరణంలో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. బుధవారం ఆయన జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, వైద్య ఆరోగ్య అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో ఆడుదాం ఆంధ్రపై టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.