VIDEO: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లోకి దూరిన పాము
W.G: తాడేపల్లిగూడెంలో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పెరిగిన మొక్కల్లోకి ఓ పాము దూరింది. దీంతో షాక్ కొట్టి పాము మరణించింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మొక్కలు పెరిగిపోయాయని ఒక వ్యక్తి వాటిని తొలగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.