చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
MNCL: దండేపల్లి మండలంలో ధర్మారావుపేటలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నిర్మల లింగయ్య (55) బుధవారం తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తైసినుద్దీన్ తెలిపారు. లింగయ్యకు భార్య లక్ష్మి ముగ్గురు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు.