ఆశ, అత్యాశే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు: ఎస్పీ

NRPT: ప్రజల ఆశే సైబర్ నేరగాళ్లు బలహీనతగా భావించి ఆర్థిక నేరాలకు పాల్పడతారని శనివారం ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. విలాసవంతమైన వస్తువులు ఇస్తామని విదేశీ యాత్రలకు పంపుతామని ఆఫర్లను ప్రకటించి ఖాతాలో డబ్బులు జమ చేయాలంటూ వచ్చే ఫోన్ కాల్స్ నమ్మకండని హెచ్చరించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీముల జోలికి వెళ్లకూడదని చెప్పారు. APK ఫైల్స్ ఓపెన్ చేయకూడదని అన్నారు.