రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

 KMM: బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రాకేశ్ నాయుడు (32) అనే యువకుడు మృతి చెందాడు. బ్రాహ్మణపల్లి వద్ద పెట్రోల్ పోయించుకొని రోడ్డు దాటుతున్న ఆయన ద్విచక్ర వాహనాన్ని వైరా వైపునకు వెళ్లే లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.