దొన గంగమ్మ జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్

దొన గంగమ్మ జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ATP: రాయదుర్గం మండలం టి. విరాపురం గ్రామంలో దొన గంగమ్మ జాతర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు.