పెదపూడి - కాకినాడ రహదారి క్లియర్

KKD: భారీ గాలులకు దోమాడ, కరకుదురు సమీపంలో చెట్లు విరిగిపడటంతో పెదపూడి-కాకినాడ రహదారికి అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పెదపూడి ఎస్సై తులసి రామ్ కుమార్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. విరిగిపడిన చెట్లను తొలగించి, దారిని క్లియర్ చేశారు. దీంతో బిక్కవోలు, గొల్లల మామిడాడ, పెదపూడి నుంచి కాకినాడకు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.