కుక్కల బెడదతో జనాలు బెంబేలు
KDP: పులివెందుల పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ వీధిలో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు వాహనదారులను, ప్రజలను వెంబడిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.