VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు తీవ్ర గాయాలు
GNTR: ఫిరంగిపురం మండలంలోని వేములూరుపాడు గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బొలెరో వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్లు గాయపడ్డారు. వాహనాల ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.