ధాన్యం విక్రయంలో సౌలభ్యం కలిగించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
JGL: రైతులకు ధాన్యం విక్రయంలో సౌలభ్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేశారు. రైతులు నేరుగా ధాన్యం విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు.