గ్రామదేవతలకు నైవేద్యం, కొబ్బరికాయలు సమర్పణం

గ్రామదేవతలకు నైవేద్యం, కొబ్బరికాయలు సమర్పణం

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రామంలోని గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం చేపట్టారు. కళ్యాణోత్సవాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ముందుగా గ్రామదేవతలకు ప్రసన్నం చేసుకున్నారు.