పద అవ్వ.. ఓటేసి వద్దాం..!
KMR: ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ కాటేపల్లి గ్రామానికి చెందిన సుమారు 83 ఏళ్ల వృద్ధురాలు గోకన్ రత్నవ్వ అందరికీ ఆదర్శంగా నిలిచారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఎస్సై అరుణ్ కుమార్ వీల్ చైర్‌పై పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.