స్మార్ట్ బస్ లౌంజ్‌ను ప్రారంభించిన తుడా ఛైర్మన్
తిరుపతి బస్టాండ్ సమీపంలో ఇంట్రాసిటీ స్మార్ట్ బస్ లౌంజ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి, ఇంట్రాసిటీ స్మార్ట్ బస్ సీఈవో మనీష్ రాథితో కలిసి ప్రారంభించారు. అలాగే తిరుపతికి వచ్చి, వెళ్ళే ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అందించడానికి ఈ స్మార్ట్ బస్ లౌంజ్ ఏర్పాటు చేయబడిందని ఛైర్మన్ తెలిపారు.