నరసాపురం సబ్ డివిజన్‌కు క్లూస్ టీం వాహనం
W.G: నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో నేర పరిశోధన కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'క్లూస్ టీం' వాహనం అందుబాటులోకి వచ్చింది. ఆదివారం డీఎస్పీ శ్రీవేద ఈ వాహనాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఘటనా స్థలంలోనే కీలక ఆధారాలను శాస్త్రీయంగా సేకరించేందుకు, నిందితులను త్వరితగతిన గుర్తించేందుకు ఈ వాహనం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.