'పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'
MLG: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సర్పంచ్ పోరిక సరిత అన్నారు. కోయగూడ పంచాయతీ పరిధిలోని లంబాడీ తండా అంగన్ వాడీ కేంద్రాన్ని సర్పంచ్ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాల సమగ్ర అభివృద్ధికి సహకరిస్తానని సర్పంచ్ స్పష్టం చేశారు.