రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది: శ్రీనివాస్ గౌడ్
TG: ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మాజీ సీఎం KCR హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందన్నారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ప్రధాని, రాష్ట్రపతిని కలవకుండా.. BC రిజర్వేషన్ల బిల్లు ఎలా పాస్ అవుతుందని ప్రశ్నించారు. BJP నేతలకు బాధ్యత లేదా అని అన్నారు.