స్త్రీ శక్తి పథకం పట్ల మహిళలు సంతృప్తి: ఎమ్మెల్యే

కోనసీమ: కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. శుక్రవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న మొదలైన స్త్రీ శక్తి పథకం పట్ల మహిళలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.