ఓపెన్ 10, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

ఓపెన్ 10, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

MNCL: ఓపెన్ స్కూల్ విధానంలో 10వ తరగతి, ఇంటర్ చదివిన విద్యార్థులు 2026 ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షకు ఫీజు చెల్లించాలని మంచిర్యాల DEO యాదయ్య సూచించారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 11 నుంచి 26 వరకు, రూ.25 ఫైన్‌తో 27 నుంచి జనవరి 2 వరకు, రూ.50 ఫైన్‌తో జనవరి 3 నుంచి 7 వరకు, తత్కాల్తో 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.