VIDEO: 'కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలి'
HNK: కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని రైల్వే అధికారులకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్నప్పటికీ స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. డివిజన్ ప్రకటన లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.