'కల్తీ టీ పొడుల విక్రయంపై అప్రమత్తంగా ఉండాలి'
హైదరాబాద్ నగరంలో కల్తీ టీ పొడి విక్రయాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారి దైవ నిధి ఆదివారం తెలిపారు. కల్తీ టీ పొడిని గుర్తించడానికి, రెండు వేర్వేరు దుకాణాల నుంచి తెచ్చిన టీ పొడిని నీళ్లలో వేసి రంగు తేడాను గమనించాలని సూచించారు. తేడా కనిపిస్తే వెంటనే 040-21111111 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.