ఎంపేడు వద్ద ఆటో బోల్తా పడి 9 మందికి గాయాలు

TPT: ఏర్పేడు-వెంకటగిరి హైవే శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట నుంచి వెంకటగిరికి వస్తున్న ఆటో ఎంపేడు గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఆటోలో ఉన్న 9మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా వెంకటగిరి మండలం ఎండీకండ్రిగ వాసులని సమాచారం. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో తిరుపతిలో ఆసుపత్రికి తరలించారు.