గుండెపోటుతో జర్నలిస్టు మృతి

గుండెపోటుతో జర్నలిస్టు మృతి

KMR: పల్వంచ మండలానికి చెందిన రిపోర్టర్ నవీన్ రెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నవీన్ రెడ్డికి చాతిలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నవీన్ రెడ్డి మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, తోటి జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.