జిల్లాలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం: వ్యవసాయాధికారి
ATP: జిల్లాలో మార్చి 16 నుంచి 18 వరకు, తిరిగి 23 నుంచి 25 వరకు 'రైతన్నా మీకోసం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రవి కుమార్ తెలిపారు. గ్రామస్థాయి అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అధికారులు రోజుకు 90 ఇళ్లను సందర్శించి ప్రగతి నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.