'బొర్రంపేట గ్రామాన్ని సరుబుజ్జిలి మండలానికి మార్చాలి'
SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్.పేట మండలంలో ఉన్న బొర్రంపేట గ్రామాన్ని ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలోకి మార్చాలని గ్రామస్తులు కోరారు. ఈమేరకు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. అలాగే టెక్కలి రెవెన్యూ డివిజన్ నుంచి శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లోకి మార్చాలని హిరమండలం ఏఎంసీ వైస్ ఛైర్మన్ కోవిలాపు కృష్ణమాచారి కోరారు.