భారీగా పడిపోయిన ధరలు

భారీగా పడిపోయిన ధరలు

టమోటా ధరలు భారీగా పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌లో 25 కిలోల బాక్స్‌ రూ.100 పలుకుతోంది. 25 కిలోల బాక్స్ 100 రూపాయలు అంటే కిలో 4 రూపాయలు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో కిలోకు రూ.4 కూడా రాకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. కూలీలతో తెంపించి తీసుకెళ్తే ఇటు కూలి పైసలు, అటు కిరాయి మీద పడుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.