మహిళకు అండగా ఆర్థిక సాయం అందజేత

మహిళకు అండగా ఆర్థిక సాయం అందజేత

అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్న ఎలకా దేవి అనే 32 ఏళ్ల మహిళకు, వైసీపీ సీనియర్ నాయకుడు చిన్నం నాగరాజు రూ. 50వేలు ఆర్థిక సహాయం అందించారు. అనకాపల్లికి చెందిన యువకుల ద్వారా ఈ సహాయం అందిచామన్నారు. వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా సహాయం అందిస్తానని, వెనుకబడిన దళితులకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.