మహిళపై దాడి..కేసు నమోదు

మహిళపై దాడి..కేసు నమోదు

KDP: ఇరుగుపొరుగు దుకాణాల మధ్య బోర్డు విషయమై ప్రారంభమైన గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. రూరల్ SI అరుణ్ రెడ్డి వివరాల మేరకు స్థానిక మైదుకూరు రోడ్డులో రిలయన్స్ బంకు వద్ద శ్రీదేవి, అక్తర్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు దుకాణాలు నడుమ బోర్డు విషయమై గొడవ చోటుచేసుకున్నట్లు తెలిపారు. అక్తర్ అతని సోదరుడు తనపై దౌర్జన్యం చేశారని శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.