ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

WGL: తెలంగాణ గ్రామీణ దేవాలయాలకు అందించబడుతున్న ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పథకం కింద అర్హత కలిగిన ఆలయాలకు నెలకు రూ.4 వేలు నైవేద్యం కోసం, రూ.6 వేలు అర్చకునికి గౌరవ భృతి ఇవ్వనున్నట్లు మంత్రి కొండా సురేఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. endowments.ts.nic.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.