'జీళ్లచెరువు ఆలయాభివృద్ధికి రూ. 2 లక్షల విరాళం'

KMM: కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి వ్యాపారవేత్తలు రామా శ్రీను, నాగండ్ల వెంకటేశ్వరరావు, బైరిశెట్టి రమేష్ కలిసి రూ. 2 లక్షల విరాళాన్ని శనివారం అందజేశారు. ఈమేరకు నగదును ఆలయ ఛైర్మన్ అంబాల వెంకటలక్ష్మికి అందించగా.. ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దాతలను పలువురు అభినందించారు.