రేపు అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌కు సెలవు

కోనసీమ: ఆలమూరు మండలం మడికి శ్రీ అభయ ఆంజనేయ అంతర్రాష్ట్ర రైతు కూరగాయల మార్కెట్‌కు శివరాత్రిని పురస్కరించుకొని రేపు సెలవు ప్రకటించినట్లు కూరగాయల మార్కెట్ కమిటీ వెల్లడించారు. ప్రతి ఏడాది శివరాత్రి పురస్కరించుకుని భారీ అన్నదానం నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు.