‘స్త్రీ శక్తి’ విజయోత్సవ సభకు ఏర్పాట్లు

BPT: ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైన సందర్భంగా సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఎస్వీఆర్‌ఎం డిగ్రీ కళాశాలలో ‘స్త్రీ శక్తి విజయోత్సవ సభ’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం టీడీపీ నాయకులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.