కువైట్‌పై ఇరాన్ భీకర దాడులు

కువైట్‌పై ఇరాన్ భీకర దాడులు

ఇరాన్‌ మరోసారి తమపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు కువైట్ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. డ్రోన్ల శకలాలు పడడంతో సోషల్ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నట్లు పేర్కొంది. దానిలో అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని.. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు.