రాజేంద్రనగర్‌లో రూ.2.32 కోట్లు పలికిన లడ్డు

RR: గణపతి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాలో ఏకంగా రూ.2.32కోట్లు పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు. ఈసారి రూ.కోటి నుంచి వేలం మొదలు పెట్టినట్లు సమాచారం. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికింది.