న్యాయవాద సంఘ అధ్యక్షుడిగా చంద్రుడు
KRNL: జిల్లా న్యాయవాద సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బి.చంద్రుడు విజయం సాధించారు. సోమవారం జరిగిన పోలింగ్లో 1059 ఓట్లకు 905 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి మురళి మోహన్‌పై 14 ఓట్ల మెజార్టీతో చంద్రుడు గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా టి.మహేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడిగా బి.మద్దులేటి, జాయింట్ సెక్రటరీగా జహంగీర్ బాషా, స్పోర్ట్స్ సెక్రటరీగా ప్రభాకర్ ఎన్నికయ్యరు.